ప్రతిభావంతులైన 20 మంది షూటర్లకు ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ నిర్ణయించింది. 2024 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఎంపిక చేసిన షూటర్లకు ఏడాది పాటు అంతర్జాతీయ కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తారు. ప్రాజెక్ట్ లీప్లో భాగంగా ఆటగాళ్లను గుర్తించి శిక్షణ ఇచ్చి, పతకాలు సాధించేలా చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
views: 958