Current Affairs Telugu Daily

నేపాల్‌లో భారీ మంచు తుఫాన్‌తో విరిగిపడిన మంచుకొండలు 
భారీ మంచు తుఫాన్ నేపాల్‌లో భీభత్సం సృష్టించింది. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని గుర్జా పర్వతాన్ని అధిరోహించేందుకు వచ్చిన తొమ్మిది మంది పర్వతారోహకులు మృత్యువాతపడ్డారు. మృతిచెందినవారిలో ఐదుగురు దక్షిణ కొరియా దేశస్థులు. శుక్రవారం రాత్రి సంభవించిన మంచు తుఫాన్ కారణంగా పర్వతారోహకులు విశ్రాంతి తీసుకునే క్యాంప్ పూర్తిగా నాశనమైంది. తుఫాన్ ధాటికి ఒక్కసారిగా మంచుకొండలు విరిగిపడటంతో క్యాంప్‌లోని గుడారాల్లో ఉన్న తొమ్మిది మంది పర్వతారోహకులు మంచుచరియల కింద చిక్కుకుపోయి చనిపోయారని పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు.
views: 633



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams