Current Affairs Telugu Daily

DSRV వ్యవస్థను ప్రవేశపెట్టిన భారత్‌ 
సముద్ర గర్భంలో పయనిస్తూ విపత్తులో చిక్కుకుపోయిన లేదా మొరాయించిన జలాంతర్గాములను రక్షించే డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికిల్‌(DSRV) అనే కీలక వ్యవస్థను భారత నౌకాదళం ప్రవేశపెట్టింది.
  • దీంతో ఇలాంటి సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికిల్‌(DSRV) వ్యవస్థను భారత్‌ సమకూర్చుకోవడం ఇదే మొదటిసారి.
  • ఈ వ్యవస్థను మొరాయించిన జలాంతర్గాముల్లోని సిబ్బందిని రక్షించడానికి ప్రధానంగా ఉపయోగించనున్నప్పటికీ అనేక ఇతర రకాల సేవలను కూడా అందిస్తుంది. సాగర గర్భంలో కేబుళ్లు వేయడానికి కూడా దాన్ని వాడొచ్చు.
  • భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సముద్ర మార్గాల్లో చైనా నౌకాదళ కదలికలు బాగా పెరిగిన నేపథ్యంలో భారత్‌ ఈ కీలక సామర్థ్యాన్ని సమకూర్చుకుంది.
DSRV-Deep Submergence Rescue Vehicle

views: 691

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams