Current Affairs Telugu Daily

హిందూస్థానీ సంగీత స్రష్ట అన్నపూర్ణాదేవి మృతి
హిందూస్థానీ శాస్త్రీయ సంగీత సామ్రాజ్ఞిగా పేరొందిన పద్మభూషణ్‌ అన్నపూర్ణాదేవి(92) 2018 అక్టోబర్‌ 13న ముంబయిలో మృతి చెందారు.
  • ప్రఖ్యాత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు అన్నపూర్ణాదేవి మొదటి భార్య. 1941లో రవిశంకర్‌ను అన్నపూర్ణ వివాహం చేసుకున్నారు. వారిద్దరి కుమారుడు శుభేంద్రశంకర్‌ కూడా సంగీత విద్వాంసుడే.  1962లో వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యతో అన్నపూర్ణాదేవి రవిశంకర్‌ నుంచి విడాకులు తీసుకున్నారు.
  • సుమారు నలభై ఏళ్ల క్రితం తమ వైవాహిక జీవితం, తన గురించి పండిట్‌ రవిశంకర్‌ చేసిన వ్యాఖ్యతో తీవ్రంగా కత చెందిన అన్నపూర్ణాదేవి ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా సంగీత కచేరీలు చేయలేదు.
  • ఎంపిక చేసుకున్న కొద్దిమంది శిష్యులకే సంగీత శిక్షణనిచ్చారు. అలాంటి వారిలో హరిప్రసాద్‌ చౌరాసియా వంటి వారున్నారు. ‘బేస్‌ సితార్‌’గా పేర్కొనే సుబ్రార్‌ వాదనంలో ఆమెను మించిన వారు లేరంటారు సంగీత విద్వాంసులు. మధ్యప్రదేశ్‌లోని మైహర్‌ పట్టణంలో జన్మించిన ఆమె తండ్రి ఉస్తాద్‌ బాబా అలాఉద్దీన్‌ ఖాన్‌.
  • తల్లి మదీనా బేగం. సుమారు 5 సం॥ల వయసు నుంచే అన్నపూర్ణాదేవి తండ్రి దగ్గర సితార్‌ నేర్చుకున్నారు. అన్నపూర్ణాదేవి అసలు పేరు రోష్‌నారాఖాన్‌.

views: 653

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams