Current Affairs Telugu Daily

ISS యాత్ర 2019కి వాయిదా
బూస్టర్‌ రాకెట్‌ విఫంతో అంతరిక్షయానాన్ని విరమించుకొని అత్యవసరంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాము అలెక్సీ ఓవిచినిన్‌ (రష్యా), నిక్‌ హేగ్‌ (అమెరికా)లు 2019లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
  • రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ 2018 అక్టోబర్‌ 12న మాస్కోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముగ్గురు కొత్త  వ్యోమగాములతో 2018 డిసెంబర్‌ 20న ఈ యాత్ర జరగాల్సి ఉంది.
  • 2018 అక్టోబర్‌ 31న జరగాల్సిన సరకు రవాణా వ్యోమనౌక ప్రయోగాన్ని కూడా వాయిదా వేశారు. 2018 అక్టోబర్‌ 11న కజకిస్థాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యాకు చెందిన సోయజ్‌ వ్యోమనౌక ద్వారా అలెక్సీ, నిక్‌లు నింగిలోకి దూసుకెళ్లారు.
  • ప్రయోగించిన కొన్ని నిమిషాలకు ఈ వ్యోమనౌకకు సంబంధించిన బూస్టర్‌ రాకెట్‌ విఫలమైంది.
  • రష్యా పర్యటనలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చీఫ్‌ జిమ్‌ బ్రైడెన్‌స్టీన్‌ సమక్షంలో జరిగిన ఈ ప్రయోగం విఫలం కావడం రోస్‌కాస్మోస్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు మానవసహిత అంతరిక్ష యాత్రలన్నింటినీ రోస్‌కాస్మోస్‌ నిలిపివేసింది.
  • రష్యా అంతరిక్ష సంస్థ గత కొన్నేళ్లలో అనేక వైఫల్యాలను చవిచూసింది. దీనివల్ల సరకు రవాణా వ్యోమనౌకలు, ఉపగ్రహాలను నష్టపోవాల్సి వచ్చింది.
ISS-International Space Station

views: 768

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams