Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థకు భారత్‌ ఎన్నిక
ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కుల సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) మానవ హక్కుల సంస్థకు భారత్‌ ఎన్నికైంది. 2019 జనవరి 1 నుంచి మూడేళ్ల వరకు సభ్యత్వం ఉంటుంది.
  • ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి 5 దేశాలకు స్థానం ఉండగా మన దేశంతో పాటు బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, ఫిజి, ఫిలిప్పీన్స్‌ ఎన్నికయ్యాయి. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో 97 ఓట్లు రావాల్సి ఉండగా, మన దేశానికి 188 ఓట్లు పోయ్యాయి.
  • యూఎన్‌ సాధారణ అసెంబ్లీలో 2018 అక్టోబర్‌ 12న 18 దేశాలు కొత్తగా ఎన్నికయ్యాయి. 2011-14, 2014-17 మధ్య భారత్‌ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఎన్నికైంది.
UNHRC-United Nations Human Rights Council

views: 736



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams