Current Affairs Telugu Daily

ప్రకృతి విపత్తులతో 20 ఏండ్లలో

ప్రకృతి విపత్తుల కారణంగా భారత్ గత 20 ఏండ్లలో 7950 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.88 లక్షల కోట్ల) నష్టాన్ని చవిచూసిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఆర్థిక నష్టాలు, పేదరికం, విపత్తులు 1998-2017 పేరిట ఐరాస ఒక నివేదికను విడుదల చేసింది. అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే గత 20 ఏండ్లలో ప్రకృతి విపత్తుల నష్టం భారత్‌లో 151 శాతం పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక నష్టాలలో 77 శాతం ప్రకృతి విపత్తుల వల్లనే సంభవిస్తున్నాయని పేర్కొంది..

ఐక్యరాజ్యసమితి  జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. అమెరికాకు 9440 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్టు ఆ నివేదిక తెలిపింది.


views: 604

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams