Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ కు  10 పోషణ్‌ అభియాన్‌ అవార్డులు 
మాతా శిశు ఆరోగ్యం, పౌష్టికాహారలోపం, రక్తహీనత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖలను సమన్వయం చేసుకొని చక్కని ఫలితాలను సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు 10 ‘పోషణ్‌ అభియాన్‌’ పురస్కారాలు లభించాయి. ఇందులో 2 రాష్ట్ర స్థాయి అవార్డులున్నాయి.
  • జిల్లా స్థాయి నాయకత్వ పురస్కారాలను విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా అద్భుత పనితీరు కనబరచిన కె.ఉషారాణి (ఎల్‌ఎస్‌-కృష్ణా జిల్లా), సుంకరి శ్రీలక్ష్మీ (అంగన్‌వాడీ కార్యకర్త-విజయనగరం), డి.ఎల్‌.వి.అన్నపూర్ణ (ఎల్‌ఎస్‌-తూర్పు గోదావరి), క్షేత్ర స్థాయి పనితీరులో ఓ విభాగంలో కె.సునీత (అంగన్‌వాడీ కార్యకర్త-కృష్ణా), జె.సీత (ఆశా కార్యకర్త-కృష్ణా), ఎం.సునీత (ఏఎన్‌ఎం-కృష్ణా), గ్రామ బృంద అవార్డును-పి.సునీత (అంగన్‌వాడీ కార్యకర్త), పి.లలిత (ఏఎన్‌ఎం), కె.రాములమ్మ (ఆశా కార్యకర్త), బంగారమ్మ (స్వయం సహాయక సంఘం), శేషగిరిరావు (వార్డు సభ్యుడు- కొంగవానిపాలెం-విజయనగరం) అందుకున్నారు.

views: 1011



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams