Current Affairs Telugu Daily

‘నక్కీరన్‌’ గోపాల్‌ అరెస్టు..తప్పుబట్టిన మద్రాస్‌ కోర్టు
తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ గురించి తప్పుడు కథనం రాశారంటూ ప్రముఖ జర్నలిస్ట్‌ ‘నక్కీరన్‌’ గోపాల్‌ను 2018 అక్టోబర్‌ 9న పోలీసు అదుపులోకి తీసుకున్నారు.
  • గవర్నర్‌ ప్రతిష్టను దిగజార్చేవిధంగా గోపాల్‌ అసత్య కథనాలు రాశారంటూ రాజ్‌భవన్‌ అధికారులు ఫిర్యాదు చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్టు చేశారు. ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు చర్యలను తప్పుపట్టిన మద్రాసు కోర్టు గోపాల్‌కు రిమాండ్‌ విధించేందుకు నిరాకరించింది.
  • ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్‌ ప్రస్తుతం తమిళ మ్యాగ్‌జైన్‌ ‘నక్కీరన్‌’కు ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొఫెసర్‌ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ఈ మ్యాగజీన్‌ ప్రముఖంగా ప్రచురించింది.
  • ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థిలను ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ నిర్మలాదేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.
  • ఈ క్రమంలో గవర్నర్‌ వద్దకు కూడా నిర్మలాదేవి విద్యార్థులను తీసుకెళ్లిందని గోపాల్‌ తన కథనంలో రాసుకొచ్చారు. అంతేకాక గవర్నర్‌ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్‌ నిర్మలాదేవీ పోలీసు విచారణలో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు  
నమోదైంది.

views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams