Current Affairs Telugu Daily

2018లో భారత్‌ వృద్ధి 7.3% :IMF
2018లో భారత్‌ వృద్ధి 7.3 శాతానికి పెరగొచ్చని IMF అంచనా వేసింది. 2019లో 7.4 శాతం మేర వృద్ధి చెందొచ్చని అభిప్రాయపడింది. తాజా అంచనాల ప్రకారం 2018లో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి సాధించిన దేశంగా భారత్‌ మరోసారి సత్తా చాటింది.
  • రెండో స్థానంలో ఉన్న చైనాకు, మనకు వృద్ధి రేటులో 0.7 శాతం వ్యత్యాసం ఉంది. 2017లో భారత్‌ 6.7 శాతం వృద్ధి సాధించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ పేరిట బాలీలో జరిగిన వార్షిక ఐఎంఎఫ్‌ సమావేశంలో ఈ నివేదికను విడుద చేశారు.
  • గత కొన్నేళ్లుగా భారత్‌ వస్తు సేవల పన్ను, ద్రవ్యల్బణం అరికట్టడానికి చర్యలు, దివాలా చట్టం, విదేశీ పెట్టుబడుల హేతుబద్ధీకరణ, వ్యాపారం సులభతరం చేయడం వంటి పలు కీలక సంస్కరణకులు అమలు చేసిందని తెలిపింది.
  • ఈ అంచనాలు నిజమైతే భారత్‌ మరోసారి వేగవంతమైన వృద్ధి సాధించిన దేశంగా నిలవనుంది. 2018లో చైనా కంటే 0.7 శాతం, 2019లో 1.2 శాతం వృద్ధి నమోదు చేయనుంది. 2017లో భారత్‌ను వెనక్కి నెట్టి చైనా 0.2 శాతం ఎక్కువ వృద్ధి సాధించింది.
IMF-International Monetary Fund

views: 732

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams