Current Affairs Telugu Daily

ఆసియా పారా క్రీడల్లో భారత్ కి స్వర్ణాలు
జావెలిన్‌ త్రోలో సందీప్‌ చౌధరి వ రల్డ్‌ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. ఎఫ్‌ 42-44/61-64 కేటగిరీలో సందీప్‌ జావెలిన్‌ను 60.01 మీటర్లు త్రో చేసి ప్ర పంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో 1980లో చైనా అథ్లెట్‌ మిన్‌గ్జీ గావో నమోదుచేసిన 59.82 మీటర్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
మహిళల టీ11 1500 మీటర్ల రేసులో రాజు రక్షిత, పురుషుల స్విమ్మింగ్‌ ఎస్‌7 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో జాధవ్‌ సుయాష్‌ నారాయణ్‌ స్వర్ణాలు గెలిచారు.
2016 రియో పారాలింపిక్స్‌ రజత ప తక విజేత దీపా మాలిక్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌ 53/54 కేటగిరిలో కాంస్యంతో సరిపెట్టుకుంది.
మహిళల ఎఫ్‌46 జావెలిన్‌ త్రోలో ర మ్య, మహిళల 1500 మీ టర్ల రేసులో రాధా వెంకటేశ్‌ రజతాలు సాధించారు. పవర్‌లిఫ్టింగ్‌లో సకినా ఖాటున్‌ (50 కి)కు రజతం, షూటర్లకు ఓ రజతం, కాంస్యం దక్కాయి.

తబాబి, మెహులి లకు రజతాలుఃః
యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. మహిళల జూ డో 44 కిలోల విభాగంలో మణిపూర్‌కు చెందిన తం గ్‌జామ్‌ తబాబి దేవి రజతం సాధించింది. టైటిల్‌పోరులో తబాబి మరియా గిమినెజ్‌ (వెనిజు లా) చేతిలో ఓడి రెండోస్థానంలో నిలిచింది. కాగా, ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో సీనియర్‌, జూనియర్‌ స్థా యిలో జూడోలో భారత్‌కు ఇదే తొలిపతకం. దీంతో, విశ్వక్రీడల్లో భారత్‌కు పతకం అందించిన తొలి జూ డో ప్లేయర్‌గా 16ఏళ్ల తబాబి దేవి రికార్డు నెలకొల్పింది..
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో మెహులీ ఘోష్‌ 248.0 స్కోరు చేసి రెండోస్థానంలో నిలిచింది.

views: 750

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams