Current Affairs Telugu Daily

తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ‘టి-చిట్స్‌’ యాప్‌ ప్రారంభం 
చిట్‌ఫండ్‌ సంస్థల మోసాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ ‘టి-చిట్స్‌’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • ఈ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన చిట్‌ఫండ్‌ సంస్థ వివరాలు? వాటికున్న అనుమతులు, పరిధులు సహా అన్ని వివరాలు తెలుసుకునే వీలుంటుంది. 
  • చిట్‌ఫండ్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ అయిన తేదీ మొదలు..అది ఎప్పుడు ప్రారంభమైంది? చిట్టీ నిర్వహణకు అనుమతి ఉందా? లేదా? సంస్థ పూర్వాపరాలేమిటి తదితర సమాచారం అంతా ఈ యాప్‌లో ఉంటుంది.
  • ఈ యాప్‌ను 2018 అక్టోబర్‌ 6న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు చిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. 

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams