Current Affairs Telugu Daily

చంద్రబాబునాయుడుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ పాలసీ లీడర్‌షిప్‌ అవార్డు 2018
అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం-2018 (గ్లోబల్‌ అగ్రికల్చర్‌ పాలసీ లీడర్‌షిప్‌ అవార్డు 2018)కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపికయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు ఆదాయం పెంపు, గ్రామీణ ప్రాంతా శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి, ఆయన దూరదృష్టిని పరిగణనలోకి తీసుకుని విధానపరమైన నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసినట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌) ఈడీ సీపీ షోరన్‌ 2018 అక్టోబర్‌ 8న ప్రభుత్వానికి పంపిన సందేశంలో పేర్కొన్నారు.
  • భారత ఆహార, వ్యవసాయ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తారు. 11వ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌, లీడర్‌షిప్‌ అవార్డు 2018 సంబంధించి ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 2018 సెప్టెంబరు 5న ఈ ఎంపిక నిర్వహించింది.
  • అక్టోబర్‌ 24, 25న డిల్లీలోని హయత్‌ రీజెన్సీలో పురస్కారాలు ప్రదానం చేస్తారు. వ్యవసాయ రంగంలో విధానాలు, పరిశ్రమలు, పరిశోధన, సాగు, నాయకత్వ పటిమ, ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం తదితర మొత్తం 15 విభాగాల్లో ఈ అవార్డు బహుకరిస్తారు.
  • పాలసీ లీడర్‌షిప్‌ అవార్డుకు 2015లో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, 2016లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ పురస్కారాలు అందుకున్నారు. 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఎంపికయ్యారు.
ICFA-Indian Council of Food and Agriculture

views: 840

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams