Current Affairs Telugu Daily

ఎస్‌-400 కొనుగోలుకు రష్యాతో భారత్‌ ఒప్పందం 
అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా రష్యా నుంచి ‘ఎస్‌-400’ గగనత రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్‌ ముందడుగు వేసింది.
  • భారత ప్రధాని నరేంద్రమోడి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య 2018 అక్టోబర్‌ 5న న్యూడిల్లీలో జరిగిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులో విస్తృత స్థాయి చర్చల అనంతరం రూ.36.9 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
  • మోడి, పుతిన్‌లు జారీ చేసిన పత్రిక ప్రకటనల్లో ఎస్‌-400 ఒప్పందం గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వ అధికారులు కూడా దీని గురించి బహిరంగంగా వెల్లడించలేదు. ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు అధికారిక వర్గాలు మాత్రం ధ్రువీకరించాయి. సదస్సు అనంతరం విడుదలైన భారత్‌, రష్యా సంయుక్త ప్రకటనలో ఎస్‌-400పై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ఒకే ఒక్క చోట ప్రస్తావన ఉంది.
ఎస్‌-400 నేపథ్యం
  • ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థల్లో ఎస్‌-400 అత్యంత అధునాతనమైనది. పాతబడుతున్న అమెరికా పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థ కన్నా దీనికి మెరుగైన సామర్థ్యాలు ఉన్నాయి. 400 కి.మీ. పరిధిలోని మానవ సహిత, రహిత విమానాలు.. క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను ఇది ఛేదించగలుగుతుంది. రాడార్‌ను స్తంభింపజేసే యంత్రాలూ దీనిపై ప్రభావం చూపలేవు. ఇప్పటికే చైనా దీన్ని కొనుగోలు చేసింది.
  • భారత్‌ ఎస్‌-400 కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే.. తాము ఆంక్షలు విధించాల్సి వస్తుందని అమెరికా ఇదివరకే హెచ్చరించింది. రష్యాతో ప్రముఖమైన లావాదేవీలు జరిపే పక్షాలపై ఆంక్షలను అమలు చేసేందుకు అమెరికా 2017 ఆగస్టులో ‘కాట్సా’ అనే చట్టాన్ని తెచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత రష్యాతో భారత్‌ రక్షణ ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. 
  • ‘ఎస్‌-400’ కాకుండా భారత్‌, రష్యా మధ్య మరో 8 ఒప్పందాలు కుదిరాయి. అంతరిక్షం, అణుశక్తి, రైల్వే రంగాలకు సంబంధించిన అంశాలు వీటిలో ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’కు సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది.
  • రష్యా అంతరిక్ష సంస్థ, ఇస్రో మధ్య ఈమేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. రష్యా సంస్థ ఫోస్‌అగ్రో నుంచి 20 లక్షల టన్నుల ఎరువును దిగుమతి చేసుకునేందుకు భారతీయ పొటాష్‌ లిమిటెడ్‌ (ఐపీఎల్‌) సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో రూ.7,300 కోట్ల విలువైన డీఏపీ, ఎన్‌పీకే, ఇతర ఎరువును ఫోస్‌అగ్రో ఐపీఎల్‌కు సరఫరా చేస్తుంది.
  • ఇటు ఖనిజ ఎరువు రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిచేందుకు ఇరు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది. నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ మార్గం ఆధునికీకరణ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసే విషయంతోపాటు పలు అంశాలపై.. రైల్వేమంత్రిత్వశాఖ రష్యా ప్రభుత్వంతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది.
  • అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎమ్‌), సిరియస్‌ విద్యా కేంద్రాని (రష్యా)కి చెందిన యువతీయువకులతో పుతిన్‌  ముచ్చటించారు. 

views: 908Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams