Current Affairs Telugu Daily

ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం
ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 2017 జూన్‌ 22న ఆమోదముద్ర వేశారు. దీంతో 1998 నుంచి నలుగుతూ వచ్చిన వివాదానికి తెరపడినట్లయింది. త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. 371డీ అధికరణం ప్రకారం ఉపాధ్యాయు సర్వీసు నిబంధనలను ఏకీకృతం చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉన్నందున అందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత కేంద్రహోంశాఖ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించి ముందడుగు వేసింది. 371డీ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం రాష్ట్రపతి ఇదివరకు జారీచేసిన ఉత్తర్వుల్లో పాఠశాల విద్యకు సంబంధించి 23-26వరకు నిబంధనలను సవరించి తాజా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. లోకల్‌ కేడర్‌ను ఆర్గనైజ్‌ చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్ల సర్వీసు నిబంధనలకు సంబంధించి నెం.9, 10, 11, 12 జీవోలున్నాయి. 2005 నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఈ జీఓల కారణంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుకు విడివిడిగా ప్రమోషన్లు, బదిలీలు జరుగుతున్నాయి. విడిగా ఉన్న ఈ నిబంధనల స్థానంలో రెండు ప్రభుత్వాలు ఉమ్మడి నిబంధనలు తీసుకొస్తాయి. ఈ వివాదం లోకల్‌ కేడర్‌ ఆర్గనైజ్‌ కాని మండ విద్యాశాఖ అధికారి, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌,డైట్‌ లెక్చరర్లు, డీఈడీ, బీఈడీ కాలేజీ లెక్చరర్లు, స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోని పోస్టులు 2005 నుంచి భర్తీ కాలేదు. ఇప్పుడు అందరి సర్వీసులను ఏకీకృతం చేయనున్నందున ఆ పోస్టులను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులను ఉమ్మడి సీనియారిటీ కిందికి తీసుకొచ్చి ఆ పోస్టుల్ని భర్తీ చేస్తారు. కేంద్రం గెజిట్‌ జారీ చేస్తే ప్రభుత్వాలు కొత్త జీఓలు జారీ చేయాల్సి ఉంటుంది. గతంలోని ఉత్తర్వులకు సవరణ చేసి కొత్త జీఓను విడుదల చేయాలి. తర్వాత సీనియారిటీ జాబితా తయారు చేసి ప్రమోషన్‌లు ఇస్తారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమల్లోకి వస్తే ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులనే బేధం ఉండదు.
views: 986

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams