Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీకి మొదటి స్థానం 
దేశంలో అత్యంత సంపన్నుల్లో తొలి స్థానం మళ్లీ రియన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీకే దక్కింది.
  • ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 100 మంది భారతీయ సంపన్నుల జాబితాలో ఆయన వరుసగా 11వ సారి మొదటి స్థానంలో నిలిచారు. వీరందరి ఆస్తులూ కలిసి దాదాపు 492 బిలియన్‌ డాలర్లని ఫోర్బ్స్‌ వెల్లడించింది.
  • గత ఏడాది విలువ 479 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 2.7శాతం మేరకు పెరిగింది.  రూపాయి పతనం, భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రతికూలత నేపథ్యంలోనూ ముకేశ్‌ అంబానీ సంపద రూ.68 వేల కోట్ల (9.3 బిలియన్‌ డాలర్లు) మేరకు వృద్ధి చెందింది. ఇందుకు ప్రధాన కారణం జియోనే.  
  • విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ. ఆర్సెలార్‌ మిత్తల్‌ ఛైర్మన్‌-సీఈఓ లక్ష్మీ మిత్తల్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
  • 8.4 బి.డాలర్లతో జిందాల్‌ గ్రూపు వ్యవస్థాపకుడు ఓం ప్రకాశ్‌ జిందాల్‌ భార్య సావిత్రి జిందాల్‌ (14వ స్థానం), 3.6 బి.డాలర్లతో బయోకాన్‌ను స్థాపించిన కిరణ్‌ మజుందార్‌ షా (39వ స్థానం), 2.5 బిలియన్‌ డాలర్లతో యూఎస్‌వీ ఇండియా వ్యవస్థాపకుడైన విఠల్‌ గాంధీ కుమార్తె లీనా తివారీ 64వ స్థానంలో ఉన్నారు. 
ఈ జాబితాలో నలుగురు తెలుగువారికీ స్థానం దక్కింది. 
  • పీపీ రెడ్డి (47వస్థానం): మేఘా ఇంజినీరింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను 1989లో స్థాపించి మున్సిపాలిటీల్లో నీటి పైపును ఏర్పాటు చేయడాన్ని ప్రారంభించారు. ఆనకట్ట నిర్మాణం, సహజ వాయువు పంపిణీ, విద్యుత్‌ ప్లాంట్లు, రోడ్ల నిర్మాణం చేపట్టారు.
  • 2006లో సంస్థ పేరును మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌గా మార్చారు. ఆయన మేన్లుడైన పీవీ కృష్ణారెడ్డి 1991లో కంపెనీలో చేరి, ప్రస్తుతం అన్ని బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌లోనూ మేఘా పెట్టుబడున్నాయి.
  • పీవీ రాంప్రసాద్‌ రెడ్డి (50వ స్థానం): జనరిక్‌ ఔషధా విభాగంలో అగ్రశ్రేణి కంపెనీ అరబిందో ఫార్మాను పీవీ రాంప్రసాద్‌ రెడ్డి 1986లో స్థాపించారు. అన్ని రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. 
  • మురళి దివి (53వ స్థానం): అమెరికా నుంచి తిరిగొచ్చిన మురళి దివి 28 ఏళ్ల క్రితం దివీస్‌ లేబొరేటరీస్‌ను స్థాపించారు. బహుళజాతి ఔషధ కంపెనీలు ఎన్నింటికో ఈ సంస్థ ఔషధాలు సరఫరా చేస్తుంది. ‘కస్టమ్‌ మాన్యుఫాక్చరింగ్‌’ విభాగంలో దీనికి ఎంతో పేరుంది. దివీస్‌ లేబొరేటరీస్‌ మార్కెట్‌ విలువ రూ.34,000 కోట్ల వరకూ ఉంది.
  • డాక్టర్‌ అంజిరెడ్డి కుటుంబం: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకుడైన డాక్టర్‌ అంజిరెడ్డి కుటుంబానికి ఈ కంపెనీలో 27శాతం వాటా ఉంది. అంజిరెడ్డి కుమారుడు సతీశ్‌ రెడ్డి ఈ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎండీ, సీఈఓగా జీవీ ప్రసాద్‌ ఉన్నారు.

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams