Current Affairs Telugu Daily

ప్రపంచ అగ్రశ్రేణి బ్రాండ్‌గా యాపిల్‌ 
ప్రపంచంలోనే టాప్‌ బ్రాండ్‌గా యాపిల్‌ నిలిచింది. అంతర్జాతీయ బ్రాండ్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్‌ ‘2018 అత్యుత్తమ 100 అంతర్జాతీయ బ్రాండ్స్‌’ శీర్షికన నివేదికను 2018 అక్టోబర్‌ 4న విడుదల చేసింది.
2018 అత్యుత్తమ 100 అంతర్జాతీయ బ్రాండ్స్‌
1    యాపిల్‌ 
2    గూగుల్‌
3    అమెజాన్‌ 
4    మైక్రోసాఫ్ట్‌ 
5    కోకకోలా
6    శామ్‌సంగ్‌ 
9    ఫేస్‌బుక్‌     
  • యాపిల్‌ బ్రాండ్‌ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 16 శాతం పెరిగి 214.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 15.66 లక్షల కోట్లు)కు చేరింది. అమెరికాలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.73 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువ సాధించిన తొలి కంపెనీగా ఘనత పొందింది.
  • తాజా ఆవిష్కరణలైన ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఎక్స్‌ఆర్‌ ద్వారా సంస్థ విలువ మరింత పెరిగింది. దీంతోపాటు అధికులకు ఉపయోగపడే యాప్‌లు, సేవలను ఆవిష్కరిస్తోంది.
  • 2017 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సేవల విభాగ ఆదాయం 23 శాతం వృద్ధితో 30 బి.డాలర్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. 
  • జాబితాలో 2వ స్థానంలో నిలిచిన గూగుల్‌ బ్రాండ్‌ మివ 10 శాతం పెరిగి 155.5 బి.డార్ల (సుమారు రూ.11.35 క్ష కోట్లు)కు చేరింది. 
  • అమెజాన్‌ బ్రాండ్‌ మివ 56 శాతం వృద్ధితో 100.8 బి.డాలర్లకు చేరడం ద్వారా, 3వ స్థానం పొందింది. 
  • మైక్రోసాఫ్ట్‌ (92.7 బి.డాలర్లు -4వ స్థానం), కోకకోలా (66.3 బి.డాలర్లు-5వ స్థానం), శామ్‌సంగ్‌ 6వ స్థానం పొందాయి. 
  • కేంబ్రిడ్డ్‌ అనలిటికా డేటా లీక్‌ వివాదంతో, ఫేస్‌బుక్‌ బ్రాండ్‌ విలువ 6శాతం తగ్గింది. ఫలితంగా 9వ స్థానానికి దిగజారింది.

views: 776



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams