Current Affairs Telugu Daily

అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా బరన్వాల్‌ 
భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్‌ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు.
  • అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రీటా బరన్వాల్‌ను ఈ పదవికి నామినేట్‌ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్‌ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాలో నియమితులవుతారు.
  • ఈ హోదాలో అణు సాంకేతికత పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను రీటా చేపడతారు. ప్రస్తుతం అణు విభాగంలోని గేట్‌వే ఫర్‌ యాక్సిరేటెడ్‌ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రీటా..
  • గతంలో అమెరికా నావికాదళ రియాక్టర్లలో వాడే అణు ఇంధన పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు. రీటా బరన్వాల్‌ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, మిషిగాన్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పొందారు. 

views: 738

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams