Current Affairs Telugu Daily

వాసాల నర్సయ్యకు బాల సాహిత్య పురస్కార్‌-2017
తెలంగాణలోని జగిత్యా జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసాల నర్సయ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క బాల సాహిత్య పురస్కార్‌-2017 లభించింది. బాల సాహిత్యంలో చేసిన కృషికి ఆయనకు ఈ అవార్డు దక్కింది. 35 సం॥లుగా బాలల పుస్తకాల ద్వారా చేసిన సాహితీ సేవల్ని గుర్తించి నర్సయ్యను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. నర్సయ్య పిల్లల కోసం 670 స్ఫూర్తి కథలు రాశారు. సుమారు 50 దాకా పుస్తకాలు అచ్చయ్యాయి. వివేకాందుడు, గాంధీ, నెహ్రూ తదితర స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఉన్నత వ్యక్తుల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా స్ఫూర్తి కథలు రచించారు. బాల సాహిత్యంలోనే తపాలా ప్రపంచాన్ని ఆవిష్కరించారు. పలు పత్రికల్లో రచనలు ప్రచురితమయ్యాయి. చిట్టిపొట్టి కథలకు తెలుగు విశ్వవిద్యాయ పురస్కారం దక్కింది. పోస్టుమాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసినప్పటికీ 75 ఏళ్ల వయస్సులో కూడా నర్సయ్య రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams