Current Affairs Telugu Daily

46వ సీజేఐగా జస్టిస్‌ గొగోయ్‌ ప్రమాణ స్వీకారం 
సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ (63) 2018 అక్టోబర్‌ 3న బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జస్టిస్‌ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు.
  • ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్‌ కోర్టు నంబర్‌ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదుతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు.
  • 2019 నవంబర్‌ 17న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది.
  •  జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వస్తూనే రోస్టర్‌పై ఈయన తన ముద్ర చూపించారు. సీజేఐ ఆదేశాల ప్రకారం 2018 అక్టోబర్‌ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసుకు ఇదే రోస్టర్‌ అమవుతుంది.
  • ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్‌, సెబీ, బీమా, ఆర్‌బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్‌ కార్పస్‌, క్రిమినల్‌ కేసు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్‌ అంశాలకు సంబంధించిన కేసును విచారిస్తుంది.
  • సీజేఐ తర్వాత సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖ ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు.
  • 1954 నవంబర్‌ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో గొగోయ్‌ జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గౌహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్‌, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్‌ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్‌ 9న పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్‌ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

views: 756

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams