Current Affairs Telugu Daily

వాయులీనం విద్వాంసుడు బాలభాస్కర్‌ మృతి
వాయులీనం విద్వాంసుడు, సినీ సంగీత దర్శకుడు బాలభాస్కర్‌(40) 2018 అక్టోబర్‌ 2న తిరువనంతపురంలో మృతి చెందాడు. 2018 అక్టోబర్ 2న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
  • 2018 సెప్టెంబర్‌ 25న బాలభాస్కర్‌, ఆయన భార్య లక్ష్మీ, కూతురు తేజస్విని(2) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తేజస్విని ఘటనా స్థలిలోనే మృతిచెందగా.. తీవ్రగాయాపాలైన బాలభాస్కర్‌, లక్ష్మీ, డ్రైవర్‌ అర్జున్‌ను తిరువనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలభాస్కర్‌ మృతి చెందారు. బాలభాస్కర్‌ మూడేళ్ల ప్రాయంలోనే సంగీత అభ్యాసం ప్రారంభించారు.
  • ఆయన బాబాయి బి.శశికుమార్‌ దగ్గర పలు వాయిద్యాలను నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే సంగీతంలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 17వ ఏట సినీ సంగీత దర్శకుడిగా విమర్శకు ప్రశంసలు అందుకున్నారు. మళయాళ చిత్రం ‘మాంగళ్య ప్లక్‌’కు సంగీత దర్శకత్వం వహించారు.
  • మయాళం, తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు సంగీత సహకారం అందించారు. పలు భాషల్లో ఆల్బమ్‌లు రూపొందించారు. చలనచిత్రాలతో పాటు.. యాడ్‌ ఫిల్మ్‌లు, సీరియళ్లకు సంగీతం అందించారు.

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams