Current Affairs Telugu Daily

వయోజనులంతా మాధ్యమిక విద్య పూర్తిచేస్తే పేదరికం మాయం : యునెస్కో
పేదరికాన్ని తరిమికొట్టడంలో విద్య ప్రాధాన్యాన్ని తాజాగా UNESCO నొక్కిచెప్పింది. వయోజనులంతా మాధ్యమిక విద్యను పూర్తిచేస్తే సగానికి పైగా పేదరికం తుడిచిపెట్టుకు పోతుందని వివరించింది. పలు దేశాల్లో పాఠశాల దశలోనే చదువును వదిలేస్తున్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఐక్యరాజ్యసమితి అత్యున్నత స్థాయి రాజకీయ వేదిక’ సదస్సు జులైలో జరుగనుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరిక నిర్మూలునపై దీనిలో చర్చలు జరుపనున్నారు. దీంతో పేదరికాన్ని తరిమికొట్టడంలో విద్యను కీలకాంశంగా గుర్తించాల్సిన ప్రాధాన్యతను తాజా నివేదికలో యునెస్కో ప్రముఖంగా ప్రస్తావించింది.
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization 
UNESCO డైరెక్టర్‌ జనరల్‌ - ఇరీనా బకోవా 
నివేదికలో కీలక అంశాలు... 
- వయోజనులంతా మాధ్యమిక విద్యను పూర్తిచేస్తే.. 42 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి భిస్తుంది
- సహారా ఎడారికి దిగువనున్న ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో పేదరికం మూడిరట రెండొంతులకు తగ్గుతుంది. 
- ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం మంది పిల్లలు ప్రాథమిక విద్యకూ నోచుకోవడం లేదు
- 2015లో మొత్తంగా 26.4 కోట్ల మంది పిల్లలు, యువత విద్యకు దూరమయ్యారు. 
- ప్రాథమిక విద్యకు దూరమైన పిల్లల్లో మూడిరట ఓ వంతు చిన్నారులు ఇథియోపియా, భారత్‌, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్థాన్‌, సూడాన్‌లోనే ఉన్నారు.

views: 854



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams