Current Affairs Telugu Daily

గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంక్‌
కేంద్రం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకొంది.
  • దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. గాంధీ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్‌ 2న డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి ఉమాభారతి ఈ ర్యాంకును ప్రకటించి, అవార్డు అందజేశారు.
  • ఈ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌ వందకు 82.57% మార్కులు సాధించి... హర్యానా, గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న 685 జిల్లాల్లో 2018 ఆగస్టు 1నుంచి 31మధ్యకాలంలో సర్వే చేపట్టారు.
  • మొత్తం 1.5 కోట్లమంది ప్రజల నుంచి వివిధమార్గాల్లో అభిప్రాయాలు స్వీకరించారు. 30వేల బహిరంగ మరుగుదొడ్లను ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ పారిశుద్ధ్యాన్ని అంచనావేశారు.

views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams