Current Affairs Telugu Daily

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2018 పురస్కారాలు ప్రదానం
దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఐకాన్‌లలో చార్మినార్‌ తొలిస్థానంలో నిలిచింది. స్వచ్ఛతా ర్యాకింగ్‌లో దేశవ్యాప్తంగా తెలంగాణ 8వ స్థానం, దక్షిణాదిలో 2వ స్థానాన్ని దక్కించుకుంది.
  • స్వచ్ఛతా దివస్‌ను పురస్కరించుకొని 2018 అక్టోబర్‌ 2న 4వ స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా డిల్లీలోని ప్రవాసి భారతీయ కేంద్రంలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2018 పురస్కారాలను రాష్ట్ర, జిల్లాలవారీగా అందజేశారు.
  • అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సాప్‌ అవార్డు, స్వచ్ఛతా పక్వాడ, స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేస్‌ విభాగాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమాభారతి పురస్కారాలు అందజేశారు.
  • స్వచ్ఛతా ర్యాకింగ్‌లో దేశవ్యాప్తంగా తెలంగాణ 8వ స్థానం, దక్షిణాదిలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో 30శాతానికిగానూ 22.85శాతం, పౌరుల అభిప్రాయ సేకరణ విభాగంలో 35శాతానికిగానూ 25.63శాతం, సర్వీస్‌ లెవెల్‌ పొగ్రాంలో 35శాతానికిగానూ 33శాతం దక్కించుకున్న తెలంగాణ 81.48శాతంతో 8వ స్థానంలో నిలిచింది.
  • రాష్ట్రస్థాయి పురస్కారాన్ని పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌, ఎస్‌ఎస్‌బీఎంజీ ప్రాజెక్టు డైరెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌ అందుకున్నారు.
జిల్లా విభాగంలో పెద్దపల్లి.. 
  • జిల్లా విభాగంలో 97.45శాతంతో దేశవ్యాప్తంగా 3వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. జిల్లా కలెక్టర్‌ దేవసేన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
  • జిల్లా విభాగంలో 95.59శాతంతో దేశవ్యాప్తంగా 9వ ర్యాంకు, దక్షిణాదిలో 3వ స్థానంలో వరంగల్‌ నిలిచింది. ఈ పురస్కారాన్ని ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి అందుకున్నారు. 
  • స్వచ్ఛతా ఐకాన్‌ విభాగంలో దేశంలోనే చార్మినార్‌ తొలిస్థానంలో నిలువగా ఈ పురస్కారాన్ని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ముషారఫ్‌, జీహెచ్‌ఎంసీ డైరెక్టర్‌(ప్లానింగ్‌) శ్రీనివాస్‌లు అందుకున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా ర్యాకింగ్‌లో జిల్లా విభాగంలో జగిత్యాల 15వ స్థానం, రాజన్న సిరిసిల్ల 85వ స్థానం, కరీంనగర్‌ 91వ స్థానం దక్కించుకున్నాయి. 

views: 913

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams