Current Affairs Telugu Daily

ఆర్థర్‌ ఆస్కిన్‌, గెరార్డ్‌ మౌరా, డొన్నా స్ట్రిక్లాండ్‌కు ఫిజిక్స్‌లో నోబెల్‌
లేజర్‌ ఫిజిక్స్‌లో వినూత్న ఆవిష్కరణలకుగాను 2018 సం॥నికి ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్‌ బహుమతి లభించింది. వీరిలో ఒకరు మహిళ ఉన్నారు.  అమెరికాకు చెందిన ఆర్థర్‌ ఆస్కిన్‌(96), ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్‌ మౌరా(74), కెనడాకు చెంది డొన్నా స్ట్రిక్లాండ్‌(55) సంయుక్తంగా ఫిజిక్స్‌ నోబెల్‌ అందుకోనున్నారు.  వీరి పరిశోధనల ఫలితంగా దృష్టి లోపాలను సరిదిద్దే శస్త్రచికిత్స కోసం అధునాతన సాధనాల రూపకల్పనకు వీలు కలిగింది.
  • వైరస్‌ కణాలను గుర్తించే ఆప్టికల్‌ ట్వీజర్స్‌ను ఆస్కిన్‌ కనుగొన్నారు. దీనినో పురాతన వైజ్ఞానిక స్వప్నంగా నోబెల్‌ బహుమతిని అందజేసే రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పేర్కొంది. 
  • బ్యాక్టీరియాను బతికుండగానే ఎలాంటి హాని కలగకుండా ట్వీజర్స్‌ సాయంతో పట్టుకొనే విధానాన్ని 1987లోనే ఆస్కిన్‌ తీసుకొచ్చారు. 
  • గెరార్డ్‌ మౌరా, డొన్నా స్ట్రిక్లాండ్‌లు లేజర్‌ విధానంలో నేత్ర చికిత్సకు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రపంచంలో కంటి చికిత్సకు ఈ విధానాన్నే ఉపయోగిస్తున్నారు.
  • నోబెల్‌ పురస్కారంతో పాటు అందజేసే నగదు బహుమతిలో సగం (సుమారు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు) ఆర్థర్‌ ఆస్కిన్‌కు మిగతా మొత్తాన్ని గెరార్డ్‌, డొన్నాకు చెరిసగం ఇస్తారు.
  • ఫిజిక్స్‌ విభాగంలో నోబెల్‌ పొందిన మహిళల్లో డొన్నా మూడో వ్యక్తి. డొన్నాకు ముందు భౌతికశాస్త్రంలో మేరీ క్యూరీ(1903), మారియా జియోపెర్ట్‌ మేయర్‌(1963)లో నోబెల్‌ అందుకొన్నారు.
  • నోబెల్‌ దక్కించుకున్న కురువృద్ధుల్లో ఒకరిగా ఆస్కిన్‌ (96) రికార్డులకెక్కారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు 2007లో ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ అందుకొన్న అమెరికన్‌ లియోనిడ్‌ హుర్‌విక్జ్‌(90) పేరున ఉంది. 
  • గెరార్డ్‌ మౌరా(74) యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌, ఈకోల్‌ పాలిటెక్నిక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ సంస్థతో అనుబంధం ఉండగా డొన్నా స్ట్రిక్లాండ్‌ ఒకప్పుడు మౌరా శిష్యురాలే. ప్రస్తుతం ఆమె కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ‘అపోలాన్‌’ అనే శక్తివంతమైన లేజర్‌గా భావించే ఎక్‌స్ట్రీమ్‌ లైట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(ఈసీఐ) ప్రాజెక్టులో కూడా మౌరా భాగమై ఉన్నారు. రానున్న కాలంలో న్యూక్లియర్‌ వ్యర్థాలు, కణితుల చికిత్స, అంతరిక్షంలో వ్యర్థాల శుభ్రతకు మౌరా ఆవిష్కరించిన ఈ విధానం మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

views: 780

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams