Current Affairs Telugu Daily

భారత్‌-ఉజ్బెకిస్తాన్‌ల మధ్య 17 ఒప్పందాలు
ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కత్‌ మిర్జియోయెవ్‌ భారత పర్యటనలో భాగంగా భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ మధ్య రక్షణ, వైద్యం, విద్య, సైన్స్‌, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
  • భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్‌ 2018 అక్టోబర్‌ 1న ప్రధాని నరేంద్రమోడితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు.
  • ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.

views: 735

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams