Current Affairs Telugu Daily

హిమదాస్‌కు  IOCలో ఉద్యోగం 
స్ప్రింట్‌ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(IOC) ఉద్యోగం లభించింది. హిమదాస్‌ అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తుంది.
  • ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది. ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల(హెచ్‌ఆర్‌) విభాగంలో గ్రేడ్‌ ‘ఎ’ ఆఫీసర్‌  ఉద్యోగం ఇచ్చినట్లు IOC చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉత్తియ భట్టాచార్య వెల్లడించారు.
  • హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం హిమదాస్‌కు ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది.   
IOC-Indian Oil Corporation

views: 754

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams