Current Affairs Telugu Daily

IMF ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్‌ 
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) ప్రధాన ఆర్థికవేత్త(చీఫ్‌ ఎకనమిస్ట్‌)గా భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ 2018 అక్టోబర్‌ 1న నియమితులయ్యారు.
  • ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మౌరిస్‌ ఆబ్స్‌ట్‌ఫెల్డ్‌ 2018 ఆఖరుకు పదవీ విరమణ చేయనుండగా.. అనంతరం గీతా గోపీనాథ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. రఘురామ్‌ రాజన్‌(ఆర్బీఐ మాజీ గవర్నర్‌) తర్వాత ఆ పదవిని చేపడుతున్న రెండో భారతీయ వ్యక్తి గీతా గోపీనాథ్‌.
  • హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గీత డిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏబీ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం, డిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఎంఏ పూర్తిచేశారు.
  • 2001లో ప్రిన్స్‌టన్‌కు విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేశారు. విదేశీమారక ద్రవ్యాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్య విధానం, రుణాలు తదితర అంశాలపై దాదాపు 40 వరకు పరిశోధన పత్రాలు రచించారు.
  • ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్‌ ఒకరుగా ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టైన్‌ లాగార్డే ప్రశంసించారు. 2016లో ఆమెను కేరళ ఆర్థిక సలహాదారుగా ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ నియమించగా.. అప్పట్లో వివాదాస్పదమైంది. ఆమె నియమకాన్ని కొందరు వామపక్ష నేతలు ప్రశ్నించారు.
IMF ప్రధాన కార్యాలయం - వాషింగ్టన్‌ డి.సి., అమెరికా
IMF ఏర్పాటు - 1945 డిసెంబర్‌ 27
IMF సీఈఓ - క్రిస్టియానె లగార్డె
IMF సభ్య దేశాలు - 189
IMF-International Monetary Fund

views: 850

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams