హాకీ ఇండియా నూతన అధ్యక్షుడిగా మహ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నికయ్యారు. 2018 అక్టోబర్ 1న జరిగిన హాకీ ఇండియా ఎన్నికల్లో అహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రస్తుతం సంఘంలో ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న అహ్మద్ రాజిందర్‌సింగ్ వారసుడిగా ఈ పదవి చేపట్టనున్నారు. మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రొ నింగోమ్బం, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆసిమా అలీ, భోనాథ్సింగ్(జార్ఖండ్) ఉపాధ్యక్షులుగా, రాజీందర్ సింగ్ (జమ్మూ కశ్మీర్) కార్యదర్శిగా ఎన్నికవగా, కోశాధికారిగా తపన్ కుమార్ దాస్(అస్సాం) కొనసాగనున్నారు.
మహిళ హాకీ మాజీ కెప్టెన్ అసుంత క్రా, ఫిరోజ్ అన్సారి (చత్తీస్‌గఢ్)లు సంయుక్త కార్యదర్శులయ్యారు.