Current Affairs Telugu Daily

పారిస్‌ ఒప్పందం లక్ష్య సాధన అసాధ్యం : ఐక్యరాజ్యసమితి
ఈ శతాబ్దాంతానికి భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించనివ్వకూడదనే 2015లో పారిస్‌ ఒప్పందం లక్ష్య సాధన దాదాపు అసాధ్యమేనని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదిక అభిప్రాయపడుతోంది.
  • ఈ నివేదిక సారాంశంపై ‘పర్యావరణ మార్పుపై అంతర్‌ ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ)’ దౌత్యవేత్తలు దక్షిణ కొరియా వేదికగా ఈ వారంలో విస్తృత చర్చలు జరపనున్నారు. ఐపీసీసీలో 195 దేశాలకు సభ్యత్వం ఉంది.
నివేదికలోని ముఖ్యాంశాలు 
  • ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయడం దాదాపు అసాధ్యం. ఇదే ఒరవడి కొనసాగితే ఈ పెరుగుద 3-4 డిగ్రీ సెల్సియస్‌ వరకునమోదయ్యే అవకాశముంది. 
  • గ్రీన్‌హౌస్‌ వాయువు ఉద్గారాలు యథాతథంగా ఉంటే.. 2040 నాటికే భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్‌ను దాటుతుంది. 
  • ‘1.5 డిగ్రీ సెల్సియస్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు కనీసం 50 శాతం అవకాశాలుండాంటే.. 2020 తర్వాత నుంచి వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు విడుదల తగ్గుముఖం పట్టాలి. 2050 నాటికి ఈ వాయువు ఉద్గారాలు శూన్యం కావాలి. 
  • భూతాపం పెరుగుదను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు మూడింట రెండొంతుల అవకాశం ఉండాలంటే.. వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు విడుదలను 55 వేల కోట్ల టన్నులకు పరిమితం చేయాలి. కానీ, ప్రస్తుత ఒరవడి కొనసాగితే.. కేవలం 14 ఏళ్లలో ఆ మొత్తం వాయువు వాతావరణంలోకి చేరుకుంటుంది. 
  • భూతాపంలో పెరుగుదల మనం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 0.5 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువైనా.. మానవాళిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలుంటాయి. వడగాలులు పెరుగుతాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు కరిగి.. సముద్రమట్టాలు పెరుగుతాయి. 
  • ఇంధన అవసరాలు తగ్గించుకోవడం, మాంసాహారాన్ని పొదుపుగా తీసుకోవడం, జీవ ఇంధనాల వినియోగం, అడవు విస్తరణ వంటి చర్య ద్వారా భూతాపం పెరుగుదలను నియంత్రించవచ్చు.

views: 730



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams