Current Affairs Telugu Daily

స్వీడిష్‌ అకాడమీ సభ్యుడు జీన్‌ క్లాడ్‌ అర్నౌల్‌కు 2 సం॥ల జైలుశిక్ష
నోబెల్‌ పురస్కారాలు బహూకరించే స్వీడిష్‌ అకాడమీకి చెందిన కీలక సభ్యునికి అత్యాచారం నేరంపై 2 సం॥ల జైలుశిక్ష పడింది.
  • సాహిత్యంలో నోబెల్‌ పురస్కారాలు ప్రకటించడంలో ప్రముఖ పాత్ర పోషించే జీన్‌ క్లాడ్‌ అర్నౌల్‌కు ఈ శిక్ష విధిస్తూ స్టాక్‌హోం జిల్లా కోర్టు 2018 అక్టోబర్‌ 1న తీర్పునిచ్చింది.
  • ఇద్దరిపై అత్యాచారం చేసినట్టు 2011లో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో నేరం రుజువయింది. తాను గాఢనిద్రలో ఉండడంతో ఏమి జరిగిందో తెలియదని మరో మహిళ చెప్పడంతో ఆ కేసును కొట్టివేసింది.
  • అర్నౌల్‌ స్వీడన్‌ దేశం సాంస్కృతిక రంగంలో ప్రముఖ వ్యక్తి. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, అకాడమీ రహస్యాలను కాపాడడం లేదని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

views: 688

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams