Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం
రాష్ట్ర సమాచార కమిషనర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కె.రవికుమార్‌, రిటైర్డ్‌  ఐపీఎస్‌ అధికారి బీవీ రమణ కుమార్‌, న్యాయవాది కట్టా జనార్దన్‌లు నియమితులయ్యారు. వీరిపేర్లను గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో 2018 అక్టోబర్‌ 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 5 సం॥ల పాటు పదవిలో ఉంటారు.
  • ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా కె.రవికుమార్‌ వివిధ హోదాల్లో పనిచేసి చీఫ్‌ కన్సర్వేటివ్‌ ఆఫీసర్‌(సీసీఎఫ్‌)గా పదవీ విరమణ చేశారు.
  • ఐపీఎస్‌ అధికారి రమణకుమార్‌ టీటీడీ చీఫ్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు.
  • కట్టా జనార్దన్‌ దశాబ్దాలుగా హైకోర్టు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.

views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams