Current Affairs Telugu Daily

హైపర్‌ సోనిక్‌ విమానాలను పరీక్షించిన చైనా
వాయువేగంతో లక్ష్యాను కచ్చితంగా చేరుకోగల సామర్థ్యమున్న 3 రకాలైన హైపర్‌సోనిక్‌ విమానాలను చైనా విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ క్షిపణుల వేగానికి తగ్గట్టుగా వేగాన్ని సర్దుబాటు చేసుకుని వాటిని ధ్వంసం చేయ గల సామర్థ్యం ఈ విమానాల సొంతం. ఈ విమానాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే రక్షణ శాఖలోని అన్ని విభాగాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ 3 రకాల విమానాలను వైడ్‌ స్పీడ్‌ రేంజ్‌ వాహనాలుగా పేర్కొంటున్నారు.
  • ధ్వనివేగాన్ని మించిన వేగంతో తక్కువ సమయంలో లక్ష్యాలను చేరుకునే సామర్థ్యమున్న ఈ విమానాలను వాయవ్య చైనాలోని జిక్వాన్‌ శాటిలైట్‌ లాంచ్‌ కేంద్రం విజయ వంతంగా పరీక్షించినట్లు చైనా మీడియా వెల్లడించింది.
  • ఈ మూడు రకాల విమానాలు D 18-1S, D18-2S, D18-3S కోడ్‌తో విభిన్న రూపాల్లో ఉన్నట్లు సీసీటీవీ వీడియోల్లో స్పష్టంగా కన్పించినట్లు చైనాకు చెందిన మీడియా సంస్థ పేర్కొంది.
  • చైనా 2014 నుంచి ఈ హైపర్‌ సోనిక్‌ విమానానాను పరీక్షిస్తోంది. యూఎస్‌, రష్యాలు కూడా ఇదే విధమైన ప్రయోగాలు చేస్తున్నాయి.

views: 719

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams