Current Affairs Telugu Daily

ఉద్యోగుల అవినీతి కేసు పర్యవేక్షణకు ఆన్‌లైన్‌ వ్యవస్థ 
ఉద్యోగులపై అవినీతి కేసు పరిష్కారంలో ఆలస్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేసు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు 2017 జూన్‌ 22న ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించింది. అవినీతి కేసు, క్రమశిక్షణ చర్యలపై పర్యవేక్షణకు తెచ్చిన ఈ వ్యవస్థతో జాప్యానికి అడ్డుకట్ట పడటమే కాకుండా పార్శదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో అనుచిత జాప్యం జరిగితే దీనిని గుర్తుచేస్తూ బాధ్యులైన అధికారులకు ఎప్పటికప్పుడు సందేశాలు పంపే సదుపాయమూ ఈ వ్యవస్థలో ఉంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 3,500 మంది ప్రభుత్వ అధికారులు అవినీతి ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను పూర్తిచేయడానికి ఆయా విభాగాలకు సగటున దాదాపు మూడేళ్లు పడుతోందని సీవీసీ అధ్యయనంలో తేలింది.
views: 871

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams