Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌చంద్ర పునేఠ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ నియమితులయ్యారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేయడంతో 2018 సెప్టెంబర్‌ 28న నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పదవీకాలం 2018 సెప్టెంబర్‌ 30తో ముగియనుంది.
  • ఆయన స్థానంలో 1984 బ్యాచికి చెందిన పునేఠ పదవీ బాధ్యతను స్వీకరించనున్నారు. 2019 మే వరకు పునేఠ ఈ పదవిలో కొనసాగనున్నారు. 
  • ఉత్తరాఖండ్‌లో జన్మించిన అనిల్‌చంద్ర పునేఠ ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో చదువుకున్నారు.
  • లండన్‌లో ఆంగ్లంలో ఎంఏ పట్టా కూడా పొందారు. సివిల్స్‌లో ఎంపికై కడప జిల్లా రాజంపేట సబ్‌కలెక్టర్‌గా సేవను ప్రారంభించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌కలెక్టరుగానూ వ్యవహరించారు.
  • మెదక్‌, కర్నూలు జిల్లాకు సంయుక్త కలెక్టరుగా, మెదక్‌ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సేవందించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరుగా, గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యానశాఖకు కమిషనర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
  • కుటుంబఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌గా, వైద్యఆరోగ్య శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగానూ వ్యవహరించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శి హోదాలోనూ కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు 1993-94, 94-95, 95-96లో ఉత్తమ కలెక్టరుగా అవార్డు పొందారు.

views: 879

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams