Current Affairs Telugu Daily

శిల్పారామాల అభివృద్ధికి సాంకేతిక కమిటీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శిల్పారామాల అభివృద్ధి ప్రణాళికలను మదింపు చేసి ఖరారు చేసేందుకు రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీని ప్రభుత్వం నియమించింది.
  • కన్సల్టెంట్లు రూపొందించే ప్రణాళికను, టెండర్లను, ప్రణాళికల్లో మార్పు చేర్పులను ఈ కమిటీనే చూస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ 2018 సెప్టెంబర్‌ 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.
  • ఏపీ శిల్పారామం సీఈవో బి.జయరాజ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఏపీఎస్‌ఆర్టీసీ, సాగునీటి పారుదల శాఖ రిటైర్డు సీఈలు డీవీ రమణ, వి.కోటేశ్వరరావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సీఈ సీఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌ఈ డి.గంగాధర్‌రెడ్డిను సభ్యులుగా నియమించారు.

views: 842Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams