రియల్ టైం గవర్నెర్స్ సొసైటీ(RTGS)కి హిటాచీ సంస్థ ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పీపుల్స్ ఛాయిస్, జ్యూరీ అవార్డులు దక్కాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డులు ఇచ్చినట్లు RTGS 2018 సెప్టెంబర్ 28న వెల్లడించింది.
ప్రజల ఫిర్యాదు, సమస్యలను సులభంగా పరిష్కరించడంతో పాటు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టు ప్రగతిని పర్యవేక్షిస్తోందని RTGSకు హిటాచీ సంస్థ కితాబిచ్చింది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రత్యక్ష పర్యవేక్షణతో పాటు వాటిని పరిష్కరిస్తోందని పేర్కొంది.
ప్రజలే ముందు(పీపుల్స్ ఫస్ట్) లక్ష్యంగా RTGS మెరుగైన సేవలు అందిస్తోందని ప్రశంసించింది.
అమెరికాలోని శాన్డిగోలో హిటాచీ నెక్స్ట్-2018 అవార్డుల ప్రదానోత్సవంలో RTGS ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సీఈవో ఏ.బాబు ఈ అవార్డులను అందుకున్నారు.