Current Affairs Telugu Daily

తెలంగాణకు 4 పర్యాటక అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పర్యాటక అవార్డుల్లో తెలంగాణకు 4 అవార్డులు దక్కాయి. 2017-18 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక అవార్డును డిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్‌, ఆ శాఖ కార్యదర్శి రేష్మి వర్మ 2018 సెప్టెంబర్‌ 27న  అందజేశారు. జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర పర్యాటక శాఖ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, అపోలో హెల్త్‌సిటీకు ఈ పురస్కారాలు దక్కాయి.
views: 889Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams