Current Affairs Telugu Daily

BSF, SSB లకు నూతన చీఫ్‌లు
సరిహద్దు భద్రతా దళం(BSF), సశస్త్ర సీమా బల్‌(SSB)లకు కొత్త అధిపతులను కేంద్రం 2018 సెప్టెంబర్‌ 27న నియమించింది.
  • 1984 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రజినీకాంత్‌ మిశ్రా BSFకు చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన SSB చీఫ్‌గా ఉన్నారు.
  • ప్రస్తుత BSF చీఫ్‌ కేకే శర్మ 2018 సెప్టెంబర్‌ నెలాఖరుకు పదవీ విరమణ పొందనుండటంతో ఆ స్థానాన్ని మిశ్రా భర్తీ చేసి, పదవీ విరమణ వరకు (2019 ఆగస్టు) కొనసాగనున్నారు.
  • 1984 బ్యాచ్‌ హర్యానా కేడర్‌కు చెందిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ మిశ్రా స్థానంలో SSB చీఫ్‌గా నియమితులై, పదవీ విరమణ పొందే వరకు (2021 ఆగస్టు) కొనసాగుతారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో BSF సిబ్బంది, నేపాల్‌ సరిహద్దులో SSB సిబ్బంది కాపలాగా ఉంటారు. 
BSF-Border Security Force
SSB-Sashastra Seema Bal

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams