Current Affairs Telugu Daily

ఆధార్‌ రాజ్యాంగబద్ధమే : సుప్రీంకోర్టు
ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్‌ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కులుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది.
  • 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ 2018 సెప్టెంబర్‌ 26న తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్‌ కనెక్షన్లు, స్కూల్‌ అడ్మిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది.
  • ఈ తీర్పులో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే ఆధార్‌ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. మిగిలిన వారంతా ఆధార్‌ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కోర్టు తెలిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు, పాన్‌ (పీఏఎన్‌) నెంబరు కేటాయింపులో ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. 
  • టెలికాం కంపెనీతోపాటు, కార్పొరేట్‌ సంస్థకు బయోమెట్రిక్‌ ఆధార్‌ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్‌ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవ లబ్ధి కల్పించే) చట్టం-2016లోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్‌ డేటా 6 నెలల కంటే ఎక్కువ రోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. జస్టిబస్‌ చంద్రచూడ్‌ భిన్నమైన తీర్పునిచ్చారు. ఆధార్‌ చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు.
  • సీజేఐ జస్టిస్‌ దీపక్‌మిశ్రాతో పాటుగా ధర్మాసనంలోని ఇతర జడ్జీలు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఖన్విల్కర్‌లు దీంతో విభేదించారు. ఆధార్‌ బిల్లును ద్రవ్యబిల్లుగా లోక్‌సభ ఆమోదించడాన్ని సమర్థించారు. ఆధార్‌ ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు వీలుంటుందని ఈ నలుగురు పేర్కొన్నారు. ఆధార్‌ ఓ ప్రత్యేకమైన వ్యవస్థ అని.. దాన్ని అలాగే ఉంచేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి సూచించారు. ‘ఆధార్‌ పేదలకు గౌరవాన్ని కల్పిస్తుంది. వ్యక్తిగత స్వేఛకేన్నా గౌరవం దక్కడం ముఖ్యం’ అని 1,448 పేజీల తీర్పులోని కొన్ని అంశాలను చదువుతూ జస్టిస్‌ సిక్రీ పేర్కొన్నారు. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు కాస్తంత చెడు జరగటం సహజమేనన్నారు.
  • ఆధార్‌ చట్టబద్ధతపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేఎస్‌ పుట్టుస్వామి సహా 31 మంది పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలను 2018 మే 10న విచారణ పూర్తిచేసిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
  • ఆధార్‌ చట్టంలోని 33వ సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్‌ సమాచారాన్ని బలవంతంగా  సేకరించడానికి ఈ సెక్షన్‌ ప్రభుత్వానికి అధికారం కల్పించింది. ఇప్పుడు ఈ సెక్షన్‌ను కొట్టివేయడంతో భద్రతా కారణాలు చెప్పి ఆధార్‌ వివరాలు లాక్కోవడం కుదరదు.
  • ఆధార్‌ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం, నిరంతరం వారిపై నిఘా ఉంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని UIDAI(యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) పునరుద్ఘాటించింది. 
  • ఆధార్‌ రాజ్యాంబద్ధతపై న్యాయస్థానంలో దాఖలైన కేసు 9 సం॥లు నడిచింది.ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా కోర్టు భిన్న వ్యాఖ్యలు చేశాయి. చివరకు ఆధార్‌ రాజ్యంగబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
కేసు సాగిన క్రమం
2009, జనవరి: UIDAI ఏర్పాటు
2010, సెప్టెంబర్‌: తొలి ఆధార్‌ నెంబరు కేటాయింపు
2010, డిసెంబర్‌: పార్లమెంటులో ఆధార్‌ బిల్లు
2011 సెప్టెంబర్‌: 10 కోట్లకు చేరిన ఆధార్‌ పొందిన వారి సంఖ్య
2011 డిసెంబర్‌: ఆధార్‌ బిల్లుపై స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు
2012, నవంబర్‌: ఆధార్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ పుట్టుస్వామి, మరికొందరు సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు
2013, నవంబర్‌: ఈ కేసులో ప్రతివాదులుగా చేరాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం
2015, అక్టోబర్‌: ఆధార్‌ స్వచ్ఛందమేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు
2016, మార్చి 3: మళ్లీ లోక్‌సభకు ఆధార్‌ బిల్లు-2016. ఆర్థిక బిల్లుగా దీనికి ఆమోదం. ఆధార్‌ పొందిన వారి సంఖ్య 98 కోట్లు
2016, సెప్టెంబర్‌: అమల్లోకి వచ్చిన ఆధార్‌ చట్టం
2017,మే: ఆధార్‌ బిల్లును ఆర్థిక బిల్లుగా పరిగణించడంపై సుప్రీంలో కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పిటిషన్‌
2017, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ధర్మాసనం రూలింగ్‌
2018, జనవరి 17: ఆధార్‌ కేసు విచారణను ప్రారంభించిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం
2018, సెప్టెంబర్‌ 26: ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు. చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేత
UIDAI సీఈవో - అజయ్‌ భూషణ్‌ పాండే
PAN-Permanent Account Number
UIDAI-Unique Identification Authority of India,

views: 816

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams