Current Affairs Telugu Daily

అనర్హతపై స్టే వస్తే పదవిలో కొనసాగవచ్చు: సుప్రీం
శాసనకర్త అనర్హతపై సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ 26న కీలక నిర్ణయం తీసుకొంది. వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తే, ఆ సమయంలో వారి సభ్యత్వాలను పునరుద్ధరించాల్సి ఉంటుందని పేర్కొంది.
  • విచారణ జరిపిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై నిందితులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసి, స్టే పొందితే, వారిపై విధించిన అనర్హతను అమలు చేయకూడదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
  • వారు పదవిలో కొనసాగుతారని తెలిపింది. అప్పిలేట్‌ కోర్టుకు ఇలా స్టే ఇచ్చే అధికారం లేదని లోక్‌ ప్రహరి అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది.
  • ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. శిక్షను రద్దు చేయడం, స్టే ఇవ్వడం వంటి అధికారాలు అప్పీలేటు కోర్టుకు ఉన్నాయని స్పష్టం చేసింది.

views: 709

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams