Current Affairs Telugu Daily

జీతభత్యాల్లో వ్యత్యాసం ఉండొద్దు: సుప్రీం
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత వారికి ఆ క్యాడర్‌ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఉండాలని వాటిలో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • దూరదర్శన్‌ హైదరాబాద్‌ కేంద్రం ఉద్యోగి ఈ.కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం 2018 సెప్టెంబర్‌ 26న తీర్పు వెలువరించింది.
  • శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి 12 ఏళ్లు పూర్తయినా పదోన్నతులు కల్పించలేదని కృష్ణారావు క్యాట్‌ను ఆశ్రయించారు. పదోన్నతి కల్పించాలని కేంద్రాన్ని ట్రైబ్యునల్‌ ఆదేశించింది.
  • ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్‌ తీర్పును హైకోర్టు సమర్థించడంతో కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై వాద ప్రతివాదన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

views: 679



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams