Current Affairs Telugu Daily

‘మామ్‌’కు 4 సం॥లు పూర్తి
భారత్‌ అంగారక కక్ష్యలోకి ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌) నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.
  • ఇస్రో ఈ ఉపగ్రహాన్ని 6 నెలలు పాటు  మాత్రమే పనిచేసేలా రూపొందించింది. కానీ, మామ్‌ అంచనాను మించి అది సేవలు అందిస్తోంది. అపారమైన సైన్స్‌ డేటాను పంపుతోంది.
  • 980 చిత్రాలను అందించింది. అంగారక గ్రహానికి సంబంధించిన సమూల అట్లాస్‌ను తయారుచేయడంలో సాయపడింది. మామ్‌ను ఇస్రో 2013 నవంబర్‌ 5న ప్రయోగించింది.
  • 2014 సెప్టెంబర్‌ 24న అది అంగారక కక్ష్యలోకి చేరింది. భూకేంద్రం నుంచి ఎలాంటి తోడ్పాటు లేకుండా సుదీర్ఘ సమయం పాటు స్వతంత్రంగా పనిచేసేలా దీన్ని రూపొందించారు.
  • ఒకే ఫ్రేమ్‌లో అంగారకుడి వలయం మొత్తాన్నీ, ఆ గ్రహ చందమామ డైమోస్‌ ఆవలి భాగాన్ని క్లిక్‌మనిపించే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి మాత్రమే ఉంది. ‘‘నేను అంగారక కక్ష్యలోకి చేరి నాలుగేళ్లు పూర్తయింది.  
  • మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు’’ అని మామ్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ 2018 సెప్టెంబర్‌ 25న పేర్కొంది. అరుణ గ్రహంపై ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం ‘ఒలింపస్‌ మాన్స్‌’ చిత్రాన్ని కూడా ఉంచింది.

views: 740

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams