Current Affairs Telugu Daily

తెలంగాణ తాగునీటి శాఖ పునర్‌వ్యవస్థీకరణ 
మిషన్‌ భగీరథ పథకం పనులు వేగంగా పూర్తి చేయటమే లక్ష్యంగా గ్రామీణ తాగునీటి శాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఇక భగీరథ పేరిట కొత్త సర్కిళ్లు ఏర్పాటవుతాయి. వీటిలోను మరిన్ని విభాగాలు ఉంటాయి. స్థాయిను బట్టి వీటికి ఇంజినీరింగ్‌ అధికారులు నేతృత్వం వహిస్తారు. శాఖ పునర్‌వ్యవస్థీకరణపై రాష్ట్ర సర్కారు 2017 జూన్‌ 22న ఉత్తర్వు జారీ చేసింది. ఒక్కో డివిజన్‌, సబ్‌డివిజన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతారులను వీటిలో వెల్లడించింది. ప్రతి ఇంటికీ కృష్ణా, గోదావరి, లేదా వాటి ఉపనదుల నీటిని డిసెంబరు 2017లోగా సరఫరా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ మొదలుకొని ఏఈ వరకు మొత్తం 1,390 మంది అధికారులు ఇప్పుడు ఆయా కొత్త విభాగాలకు అనుగుణంగా భగీరథ పనులను పర్యవేక్షిస్తారు.
views: 929

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams