ఇంటి అవసరాల కోసం చేనేత కార్మికు వినియోగిస్తున్న విద్యుత్తులో నెలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యుత్తు బిల్లును యధావిధిగా మొదట చెల్లిస్తే 100 యూనిట్ల డబ్బుని కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 25న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాసాధికార సర్వే సమాచారం ఆధారంగా 90,765 కుటుంబాలకు నెలకు వంద యూనిట్ల విద్యుత్తు ఉచిత సరఫరా వర్తించనున్నది.