Current Affairs Telugu Daily

నేత, చేనేత కార్మికులకు ‘భవిత’ 
తెలంగాణలోని నేత, చేనేత కార్మికులకు ‘భవిత’ పేరిట సరికొత్త పొదుపు, ఆర్థిక స్వావలంబన పథకాన్ని అమలు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 జూన్‌ 24న యాదాద్రి జిల్లా పోచంపల్లిలో చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చేనేత కార్మికుల కోసం పొదుపు నిధి పథకం ఉంది. ఇందులో 8 శాతాన్ని కార్మికుడు చెల్లిస్తే మరో 8 శాతం మ్యాచింగ్‌ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం ఆశించిన మేరకు నడవడం లేదని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం దానిలో పూర్తిగా మార్పు చేసి, వారికి అధిక ప్రయోజనాలు కలిగించేలా కొత్త పథకాన్ని రూపొందించారు. ఇందులో చేనేత కార్మికులు 8 శాతం నిధిని చెల్లిస్తే ప్రభుత్వం మరో 16 శాతం జమ చేసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరమగ్గాల కార్మికులను తొలిసారిగా ఈ పథకంలో చేర్చారు. వారు 8 శాతం నిధిని చెల్లిస్తే ప్రభుత్వం మరో 8 శాతం జమ చేస్తుంది. సహకార సంఘాల్లో పని చేస్తున్న వారితోపాటు అసంఘటిత రంగంలోని వారికి దీనిని వర్తింపజేస్తారు.
views: 1059



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams