Current Affairs Telugu Daily

అంగారకుడిపై నాసా వ్యోమనౌక సెల్ఫీ 
అంగారక గ్రహంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రయోగించిన ‘మావెన్‌’ వ్యోమనౌక తాజాగా సెల్ఫీకి ఫోజిచ్చింది.
  • అరుణగ్రహం చుట్టూ తిరుగుతూ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వీయచిత్రాన్ని అందించింది. నాసా 2013 నవంబరు 18న మావెన్‌ను ప్రయోగించింది.
  • అంగారకుడి చుట్టూ పరిభ్రమించేందుకు వీలుగా ఉన్న కక్ష్యలోకి 2014 సెప్టెంబరు 21న అది ప్రవేశించింది. ప్రస్తుతం అంగారకుడి వాతావరణంపై పరిశోధనలు జరుపుతోంది.
  • అతినీలోహిత ఉద్గారాలను గుర్తించేందుకు వీలుగా ఈ వ్యోమనౌకపై ‘ఇమేజింగ్‌ అల్ట్రావైలెట్‌ స్పెక్ట్రోగ్రాఫ్‌(ఐయూవీఎస్‌)’ అనే ప్రత్యేక పరికరం ఉంటుంది.
  • అది ఓ పొడవాటి నిర్మాణం సాయంతో చుట్టూ తిరుగుతూ వ్యోమనౌకను ఫొటోలు తీయగలదు. ఐయూవీఎస్‌ తీసిన 21 భిన్న చిత్రాలతో తాజాగా మావెన్‌ సెల్ఫీని రూపొందించినట్లు నాసా వెల్లడించింది. వ్యోమనౌక తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు తెలిపింది.

views: 821

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams