Current Affairs Telugu Daily

యువతను పీడిస్తున్న నిరుద్యోగం, విద్యాలేమి 
భారతదేశంలో యువతను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యలు విద్యాలేమి, నిరుద్యోగమని ‘గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ యూత్‌ పోల్‌’ పేరుతో ఇప్సాస్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.
  • తమ అవసరాలు తీర్చడంలో, సమస్యలను పరిష్కరించడంలో రాజకీయ నాయకులు మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు ఎక్కువమంది యువత విశ్వసిస్తున్నారని వెల్లడించింది.
  • అధిక ఆదాయ దేశాలైన ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, స్వీడన్‌, అమెరికా, సౌదీ అరేబియాతోపాటు పేద-వర్ధమాన దేశాలైన బ్రెజిల్‌, చైనా, భారత్‌, ఇండోనేసియా, కెన్యా, మెక్సికో, నైజీరియా, రష్యాల్లో 40 వేలమందికిపైగా యువత నుంచి అభిప్రాయ సేకరణ జరపడం ద్వారా పేదరికం, వ్యాధులపై ప్రపంచ దేశాలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది.
  • కడు పేదరికంలో జీవిస్తున్నవారి సంఖ్య 2000 నుంచి ఇప్పటివరకు 100 కోట్లకుపైగా తగ్గినట్లు తెలిపింది.

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams