Current Affairs Telugu Daily

‘అమృత్‌’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ స్థానం
కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.
  • 65.24 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలవగా, 59.17 శాతంతో ఒడిశా, 54.32 శాతంతో మధ్యప్రదేశ్‌, 52.39 శాతంతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నగరాలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరదనీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ తదితర పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015, జూన్‌ 25న కేంద్రం అమృత్‌ పథకం ప్రవేశపెట్టింది.
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పథకం అమలు తీరు ఆధారం కేంద్రం ర్యాంకు ప్రకటించింది. మొదటి మూడు సంవత్సరాల్లో పథకం అమలు  సమీక్షించి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఈ ర్యాంకు ఇచ్చింది.
  • 2018 సెప్టెంబర్‌ 24న డిల్లీలో నిర్వహించిన జీవన సౌభ్య సూచీ-2018 జాతీయ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి చేతుల మీదుగా ఏపీ పట్టణ పరిపాలన శాఖ, అమృత్‌ మిషన్‌ డైరెక్టర్‌ కె.కన్నబాబు అవార్డు అందుకొన్నారు.
  • అమృత్‌ పథకంలో ఏపీ నుంచి కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, తెలంగాణ నుంచి వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ ఎంపికయ్యాయి. దేశంలో 10 అత్యంత నివాసయోగ్య నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి 4వ ర్యాంక్‌, విజయవాడకు 9వ ర్యాంకు దక్కాయి.
  • వ్యవస్థాపక విభాగంలో 10 నగరాల జాబితాలో తిరుపతి(2), కరీంనగర్‌(3), హైదరాబాద్‌(4), విజయవాడ(9), విశాఖపట్నం(10) ఉన్నాయి. సామాజిక విభాగంలో 10 నగరాల జాబితాలో తిరుపతి(1), విజయవాడ(8) ఉన్నాయి. ఆర్థిక విభాగంలో 10 నగరాల జాబితాలో విజయవాడ(10) మాత్రమే ఉంది. ఫిజికల్‌ విభాగంలో 10 నగరాల జాబితాలో తిరుపతి(6), విశాఖపట్నం(10) ఉన్నాయి.
  • 0.5 మిలియన్‌ కన్నా ఎక్కువ జనాభా ఉన్న తొలి మూడు నగరాల్లో తిరుపతి, కరీంనగర్‌ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నాయి.
  • పరిపాలనలో సంస్కరణలు, పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముందంజలో నిలుస్తూ మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది.
  • అమృత్‌ పథక నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి మరో అత్యున్నత పురస్కారాన్ని సాధించింది. పురపాలకశాఖలో సంస్కరణలు అమలు చేయడంలో 97.6 శాతం మార్కు సాధించి 2017లో దేశంలోనే మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
  • సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీ, కాంట్రాక్టు కేటాయింపుల, గడువులోగా పనులు పూర్తి చేయడం, నిధుల వినియోగంపై సకాలంలో ధ్రువీకరణ పత్రాలు పంపడం వంటి ప్రధాన అంశాల్లో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ ముందజలో ఉన్నట్లు కేంద్ర పట్టణాభివ ృద్ధి మంత్రిత్వశాఖ గుర్తించింది.

views: 929

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams