Current Affairs Telugu Daily

పంజాబ్‌ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం 
పంజాబ్‌లో జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది.
  • మొత్తం 354 జిల్లా పరిషత్‌ స్థానాలకుగాను 331 సీట్లు దక్కించుకుంది. శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) 18, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి ఒక్క సీటు కూడా దక్కలేదు.
  • 150 పంచాయతీ సమితిల్లోని 2,899 జోన్లకు గాను 2,351 జోన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఎస్‌ఏడీ 353, బీజేపీ 63, ఆప్‌ 20, సీపీఎం 2, సీపీఐ 1, ఎస్‌ఏడీ(అమృత్‌సర్‌) 2 సీట్లు దక్కించుకున్నాయి.
  • ఇతరులు 107 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 సెప్టెంబర్‌ 23న ఫలితాలు ప్రకటించింది. 
పంజాబ్‌ ముఖ్యమంత్రి - అమరీందర్‌సింగ్‌ 

views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams